| 1 comments |

Tuesday, February 10, 2009

Bread halwa

బ్రెడ్ తో రుచికరమైన స్వీట్స్ కూడా చేయొచ్చు.. అదెలాగో రోజు చూద్దాం..
కావలసినవి:
  • బ్రెడ్-మీడియం సైజు ప్యాక్
  • మంచి నీళ్లు-ఒకటిన్నర లీటర్
  • పంచదార-ఒక కేజీ
  • కలాకండ్ పొడి-పావ్ కేజీ
  • నెయ్యి-200 గ్రా.
  • రిఫైండ్ ఆయిల్-200 గ్రా.
  • జీడిపప్పు-75 గ్రా.
  • యాలకుల పొడి-స్పూన్
  • కేసరి ఫుడ్ కలర్-పావ్ స్పూన్
  • పచ్చ కర్పూరం-పావ్ స్పూన్
తయారుచేయు విధానం:
  • కొద్దిగా నెయ్యి వేసి జీడి పప్పు దోరగా వేఇంచి ఉంచాలి.
  • పంచదార పాకం పట్టి అందులో పచ్చ కర్పూరం,యాలకుల పొడి కలిపి పెట్టుకోవాలి.
  • బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • నూనె,నెయ్యి సమ పాళ్ళలో తీసుకుని,దానిలో బ్రెడ్ ముక్కల్ని దోరగా వేఇంచాలి.
  • అందులో మంచి నీళ్లు పోసి కేసరి రంగు,కలాకండ్ పొడి వేసి కలుపుతూ ఉడికించాలి.
  • ఈ మిశ్రం చిక్కపడుతుండగా పంచదార పాకం,జీడి పప్పు( గింజలు తీసిన ఎండు కర్జూరాలు కూడా నచ్చితేవేసుకోవచ్చు) వేసి మిగిలిన నెయ్యి కూడా వేసి సన్నని సెగ మీద ఉడికించి దించాలి.
ఎండు ద్రాక్ష,చెర్రీలు వేసి అలంకరించి వడ్డిస్తే చాల బాగుంటుంది.. ...read more ⇒
| 0 comments |

Monday, February 9, 2009

Veg 65

రోజు వెజ్ 65 ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసినవి:
  • క్యారెట్-100 గ్రాములు
  • బీన్స్-100 గ్రా.
  • క్యాబేజీ-150 గ్రా.

  • క్యాప్సికం-75 గ్రా.
  • కార్న్ ఫ్లోర్ -2 స్పూన్లు
  • మైదా-50 గ్రా.
  • అల్లం వెల్లుల్లి-2 స్పూన్లు
  • ఉప్పు-తగినంత
  • మిరియాల పొడి-చిటికెడు
  • రిఫైండ్ ఆయిల్-సరిపడా
  • పచ్చిమిర్చి-30 గ్రా.
  • కరివేపాకు-తగినంత
  • పెరుగు-2 కప్పులు
  • రెడ్ ఆరెంజ్ కలర్-చిటికెడు
తయారుచేయు విధానం:
  • కాయగూరాలన్నీ సన్నటి ముక్కలుగా తరిగి నీటిలో ఉడికించి,నీరు పిండి గిన్నెలో వేయాలి.
  • దీనిలో కార్న్ ఫ్లోర్ ,మైదా,ఉప్పు,అల్లం వెల్లుల్లి ముద్దా,మిరియాల పొడి కలిపి కొంచిం నీళ్లు కలిపి ముద్దలా చేసుకోవాలి.
  • ముద్దలో కరివేపాకు కలిపి ఉండలుగా చేయాలి.
  • వీటిని వేడి నూనెలో ఎర్రగా ఫ్రై చేయాలి.
  • ఒక బాణలిలో కొంచెం నూనె పోసి అడ్డంగా చీల్చిన పచ్చిమిర్చి,కరివేపాకు వేసి బాగా వేఇంచి,తీయాలి.
  • తరువాత బాణలిలో కొంచెం నూనె పోసి,పెరుగు పోయాలి. దీనిలో ఆరెంజ్ కలర్ కూడా కలపాలి.
  • మిశ్రమాన్ని సగం అయ్యే వరకు గరిటెతో కలపాలి.
  • దీనిలో ఫ్రై చేసిపెట్టుకున్న ఉండల్ని వేసి బాగా ఫ్రై చేయాలి.
చివరగా వేఇంచుకున్న పచ్చిమిర్చి,కరివేపాకు వేస్తే రుచికరమైన వెజ్ 65 రెడీ.. ...read more ⇒
| 0 comments |

Friday, February 6, 2009

Veg masala

మాములు నూడుల్స్లా కాకుండా వీటికి మరికొన్ని పదార్ధాలని చేర్చి సరికొత్త రుచితో ఆరగించవచ్చు..
కావలసినవి:

  • నూడుల్స్-200 గ్రాములు

  • క్యాబేజీ తురుము-ఒక కప్పు


  • క్యారెట్ ముక్కలు-ఒక కప్పు

  • ఉల్లికాడ తురుము-ఒక కప్పు

  • పచ్చిమిర్చి-2

  • ఉప్పు-తగినంత

  • మసాల పొడి-స్పూన్

  • మంచి నీళ్లు-అర లీటర్
తయారుచ్యు విధానం:

  • క్యారెట్లను చక్రాల్లా కోసుకోవాలి.

  • బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి.

  • దీనిలో క్యారెట్ ముక్కలు,క్యాబేజీ తురుము వేసి సగం ఉడికిన తరువాత నూడుల్స్ వేయాలి.

  • ఇవి కూడా ఉడికిన తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి,ఉల్లికాడ తురుము,ఉప్పు,మసాల పొడి వేసి నీళ్లన్నీఇంకిపోయే వరకు ఉంచి దించాలి.
దీన్ని వేడివేడిగా అలానే తినవచ్చు లేదా టమాటా సాస్తో కానీ గ్రీన్ సలాడ్ తో గని తింటే బాగుంటుంది..
...read more ⇒
| 0 comments |

Thursday, February 5, 2009

Soya Cutlet


కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా,పోషక విలువలు ఎక్కువగా ఉండే రుచికరమైన

సోయా కట్లెట్ తయారి ఈ రోజుచూద్దాం..

కావలసినవి:
  • సోయా గుళికలు-50 గ్రాములు
  • బీన్స్-100 గ్రా.
  • ఉడికించిన బంగాళా దుంపలు-50 గ్రా.
  • తురిమిన క్యారెట్-50 గ్రా.
  • తరిగిన క్యాబేజీ-50 గ్రా.
  • ఉల్లిపాయలు-50 గ్రా.
  • పసుపు-పావ్ స్పూన్
  • ఎండుమిర్చి కారం-అర స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-అర స్పూన్
  • ఉప్పు-తగినంత
  • నూనె-2 స్పూన్లు
  • కొత్తిమీర -తగినంత
  • గుడ్డు-ఒకటి
  • గోధుమ పిండి-చల్లడానికి సరిపడా
తయారుచేయు విధానం:
  • అరకప్పు నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి.
  • అందులో సోయా గుళికలు వేసి పది నిమిషాలు ఉడికించి దించాలి.
  • నాన్ స్టిక్ పాన్లో ఒక స్పూన్ నూనె వేసి,ఉల్లిపాయ ముక్కలు వేఇంచాలి.
  • ఇవి గోధుమ రంగులోకి వచ్చాక పసుపు,అల్లం వెల్లుల్లి ముద్దా,కారం,ఉప్పు వేసి వేఇంచాలి.
  • తరువాత సన్నగా తరిగిన బీన్స్,క్యారెట్,క్యాబేజీ,కొత్తిమీర వేసి నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి.
  • అందులో సోయా గుళికలు,మెత్తగా చేసిన బంగాళా దుంపలు వేసి గట్టిపడే వరకు ఉడికించాలి.
  • ఇది చల్లారిన తరువాత చిన్న ఉండలుగా చేయాలి.
  • వీటిని గిలకొట్టిన గుడ్డులో ముంచి గోధుమ పిండిలో అద్ది తరువాత చేతితి వొత్తాలి.
  • తరువాత పెనం వేడి చేసి నూనె పోసి,కట్లెట్ రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.
దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు,పీచు పదార్ధాలు,విటమిన్లు పుష్కలంగా ఉంటాయ్.. ...read more ⇒
| 0 comments |

Wednesday, February 4, 2009

Afgani Pulao

అఫ్గాని పలావ్ ఎలా తయారుచేయాలో ఈ రోజు చూద్దాం..
కావలసినవి:
  • మటన్ లేదా చికెన్-కిలో
  • బియ్యం-కిలో
  • నానబెట్టిన సెనగపప్పు-అర కప్పు
  • పెరుగు-పావ్ కిలో
  • ఉల్లిపాయలు-రెండు
  • అల్లం వెల్లుల్లి-రెండు స్పూన్లు
  • గరం మసాల-రెండు స్పూన్లు
  • ఉప్పు-తగినంత
  • నెయ్యి లేదా నూనె -సరిపడా
తయారుచేయు విధానం:
  • బాణలిలో సరిపడా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేఇంచాలి.
  • ఈ ముక్కలు చల్లరిపోయక పెస్ట్ల చేయాలి.
  • ఇపుడు ఆ బాణలిలో చికెన్ ముక్కలు వేసి ఎర్రగా వేఇంచాలి.
  • తరువాత పెరుగు గిలకొట్టి ఈ ముక్కల్లో వేసి,స్పూన్ అల్లం వెల్లుల్లో ముద్దా కూడా వేసి వేఇంచాలి.
  • తగినన్ని నీళ్లు పోసి ,ఇది మెత్తబడేవరకు ఉడికించాలి.
  • తరువాత దీనిలో సెనగపప్పు,ఉల్లిపాయ ముద్దా వేసి నీళ్లు ఇంకిపోయేవరకు సిమ్లో ఉంచాలి.
  • నెయ్యి పైకి తేలాక స్పూన్ గరం మసాల వేయాలి.
  • కూర వండే సమయమ్లోనే విడిగా అన్నం వండాలి. ముందుగ ఎసరు నీళ్లు మరిగిన తరువాత ఓ స్పూన్ అల్లంవెల్లుల్లి,ఉప్పు,అర స్పూన్ గరం మసాల వేసి బియ్యం వేసి అన్నం పొడిగా ఉండేలా వండాలి.
  • ఇప్పుడు మిగిలిన గరం మసాల కూడా చల్లి,రెండు స్పూన్ల నెయ్యి లేదా నూనె వేయాలి.
అన్నాన్ని ఓ బౌల్లో వేసి దానిలో ఉడికించిన చికెన్ లేదా మటన్ ముక్కలు వేస్తే ఆఫ్గాన్ పలావ్ రెడీ... ...read more ⇒
| 0 comments |

Monday, February 2, 2009

Panjabi aloo fry

హాయ్ ఫ్రెండ్స్ రోజు పంజాబీ ఆలూ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసినవి:
  • బంగాళదుంపలు-అర కిలో
  • నూనె-తగినంత
  • పెరుగు-కప్పు
  • నీళ్లు-తగినన్ని
  • మైదా-స్పూన్
  • కార్న్ ఫ్లోర్-మూడు స్పూన్లు
  • కరివేపాకు-అరకప్పు
  • కొత్తేమీర తురుము-స్పూన్
  • అల్లం వెల్లుల్లి ముద్దా -స్పూన్
  • కారం-స్పూన్
  • మిరియాలపొడి-స్పూన్
  • పచ్చిమిర్చి-పది
  • ఉప్పు-తగినంత
  • ఫుడ్ కలర్-చిటికెడు
తయారుచేయు విధానం:
  • బంగాళ దుంపల్ని ఉడికించి తొక్క తీసి ముక్కలుగా కోయాలి.
  • గిన్నెలో కార్న్ ఫ్లోర్,మైదా,అల్లం వెల్లుల్లి ముద్దా,కారం,మిరియాల పొడి,ఉప్పు,ఫుడ్ కలర్,పెరుగు,కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి పేస్ట్ చేయాలి.
  • దీనిలో బంగాళ దుంప ముక్కల్ని ముంచి,పది నిమిషాల తరువాత నూనెలో దోరగా వేఇంచాలి.
  • కళైలో రెండు స్పూన్ల నూనె వేసి,కాగాక కరివేపాకు,పచ్చిమిర్చి వేసి వేఇంచి, దీనిలో వేఇంచిన బంగాళా దుంప ముక్కలు కూడా వేసి సిమ్లో ఉంచాలి.
  • కొంచెం నీళ్లు చల్లి,బాగా వేగిన తరువాత కొంచెం కారం,కొత్తేమీర చల్లాలి.
దీనితో రుచికరమైన పంజాబీ-ఆలూ ఫ్రై రెడీ.. ...read more ⇒