| |

Monday, February 2, 2009

Panjabi aloo fry

హాయ్ ఫ్రెండ్స్ రోజు పంజాబీ ఆలూ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసినవి:
  • బంగాళదుంపలు-అర కిలో
  • నూనె-తగినంత
  • పెరుగు-కప్పు
  • నీళ్లు-తగినన్ని
  • మైదా-స్పూన్
  • కార్న్ ఫ్లోర్-మూడు స్పూన్లు
  • కరివేపాకు-అరకప్పు
  • కొత్తేమీర తురుము-స్పూన్
  • అల్లం వెల్లుల్లి ముద్దా -స్పూన్
  • కారం-స్పూన్
  • మిరియాలపొడి-స్పూన్
  • పచ్చిమిర్చి-పది
  • ఉప్పు-తగినంత
  • ఫుడ్ కలర్-చిటికెడు
తయారుచేయు విధానం:
  • బంగాళ దుంపల్ని ఉడికించి తొక్క తీసి ముక్కలుగా కోయాలి.
  • గిన్నెలో కార్న్ ఫ్లోర్,మైదా,అల్లం వెల్లుల్లి ముద్దా,కారం,మిరియాల పొడి,ఉప్పు,ఫుడ్ కలర్,పెరుగు,కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి పేస్ట్ చేయాలి.
  • దీనిలో బంగాళ దుంప ముక్కల్ని ముంచి,పది నిమిషాల తరువాత నూనెలో దోరగా వేఇంచాలి.
  • కళైలో రెండు స్పూన్ల నూనె వేసి,కాగాక కరివేపాకు,పచ్చిమిర్చి వేసి వేఇంచి, దీనిలో వేఇంచిన బంగాళా దుంప ముక్కలు కూడా వేసి సిమ్లో ఉంచాలి.
  • కొంచెం నీళ్లు చల్లి,బాగా వేగిన తరువాత కొంచెం కారం,కొత్తేమీర చల్లాలి.
దీనితో రుచికరమైన పంజాబీ-ఆలూ ఫ్రై రెడీ..

No comments: