| 3 comments |

Friday, January 16, 2009

Carrot Paayasam

పోషక విలువలున్న క్యారెట్ పాయసం ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలిసినవి:
  • క్యారెట్-మూడు
  • పాలు-అరలీటర్
  • పంచదార-కప్పు
  • యాలకులు-తగినన్ని
  • జీడిపప్పు-తగినన్ని
తయారుచేయు విధానం:

  • క్యారేట్ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరగాలి.
  • తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి,తరువాత మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి.
  • ఇప్పుడు పాలని బాగా మరగనివ్వాలి,మరిగిన తరువాత క్యారెట్ ముద్దని వెయ్యాలి.
  • తరువాత పంచదార వేసి బాగా కలపాలి. యాలకుల పొడి కూడా వెయ్యాలి.
చివరగా జీడిపప్పు వేఇంచి దీనిలో కలిపితే రుచికరమైన , ఆరోగ్యకరమైన పాయసం రెడీ... ...read more ⇒
| 0 comments |

Dhliya poori

ఎప్పుడూ ఒకే రకమైన పూరి కాకుండా కొత్త రకమైన రుచిని ధలియా పూరీతో రుచి చూడొచ్చు...
కావలిసినవి:
  • ధలియా-అరకేజీ
  • పంచదార- అరకేజీ
  • యాలకులు- ఆరు
  • మైదా- ముప్పావ్ కేజీ
  • నీళ్లు-లీటర్
తయారుచేయు విధానం:
  • మైదాపిండిలో నీళ్లు వేసి ముద్దలా అయిన తరువాత నూనె పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి.
  • పిండిని అరగంటసేపు నాననివ్వాలి.
  • తరువాత లీటర్నీళ్ళను మరగపెట్టాలి, మరుగుతున్నపుడే అరకేజీ ధలియ( గోధుమ రవ్వలాంటిది బయట మార్కెట్లో దొరుకుతుంది) వేసి ఉడికించాలి.
  • నీళ్లు పూర్తిగా ఇంకిపోయాక, పంచదార వెసి ధలియ దగ్గర పడేదాకా ఉడికించాలి.
  • ధలియాని చల్లారనివ్వాలి.
  • కలిపీ ఉంచుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • వీటి మద్యన చల్లారిన ధలియా మిశ్రమాన్ని పెట్టి,అన్ని వ్య్పులా మూసేసి పూరీల మాదిరి ఒత్తుకోవాలి.
  • తరువాత నూనెలో దోరగా వేఇంచి తీయాలి..
ఇవి నాలుగురోజుల వరకు నిల్వ ఉంటాయ్.. ...read more ⇒
| 0 comments |

Thursday, January 15, 2009

Mutton Pulao

అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు! మటన్ పలావ్ ఎలా తయారుచేయాలో ఈ రోజు చూద్దాం..
కావలసినవి:
  • మటన్- ముప్పావ్ కిలో
  • బియ్యం- మూడు కప్పులు
  • ఉల్లిపాయ- ఒకటి
  • అల్లం- చిన్నముక్క
  • వెల్లుల్లి రెబ్బలు- ఆరు
  • షాజీర- స్పూన్
  • ధనియాలు- స్పూన్
  • మిరియాలు- స్పూన్
  • లవంగాలు- ఆరు
  • యాలకులు- రెండు
  • దాల్చిన చెక్క- రెండు
  • పలావ్ ఆకులు- రెండు
  • నెయ్యి- రెండు స్పూన్స్
  • ఉప్పు- తగినంత
తయారుచేయు విధానం:
  • పాన్లో కడిగిన మాంసం ముక్కలు, బిర్యాని మసాలాలు, ఉప్పు, ఆరు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి.
  • 20 నిమిషాల పాటు ఉడికించి తరవాత మాంసం ముక్కల్ని విడిగా తీసి ఆరబెట్టాలి.
  • మసాలల్ని కూడా తీసి మెత్తగా మెదపాలి.
  • మాంసంలోనుండి వచ్చిన నీళ్ళని పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేసి, ఉల్లిపాయ ముక్కలు వేఇంచాలి. తరువాత మసాలాలు, మాంసం అన్నీ వేసికొద్దిసేపు వేఇంచాలి.
  • తరువాత పక్కకు తీసి ఉంచిన మాంసం నీళ్లు పోసి మరిగాక కడిగి ఉంచిన బియ్యం వేసి ఉడికించాలి.
అంతే వేడివేడి మటన్ పలావ్ రెడీ..
దీన్ని
పెరుగు చట్నీతో వడ్డిస్తే బాగుంటుంది..
...read more ⇒
| 0 comments |

Tuesday, January 13, 2009

Alasandala bobbatlu

ముందుగా అందరికీ సంక్రాంటి శుభాకాంక్షలు!
రోజు అలసందలుతో బొబ్బట్లు ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసినవి
:
  • మైదా- కిలో
  • అలసందలు- కిలో
  • బెల్లంతురుము- ముప్పావ్కిలో
  • నెయ్యి - పావ్కిలో
  • కొబ్బరిపొడి-100 గ్రా.
  • యాలకులు-15 పొడికొట్టాలి
  • రిఫైండ్ఆయిల్- అరకప్పు
  • ఉప్పు- తగినంత
  • నీళ్లు- తగినన్ని
తయారుచేయు విధానం:
  • మైదాలో ఉప్పు, నూనె లేదా నెయ్యి వీసి తగినన్ని నీళ్లు పోసి చపాతిముద్దలా కలిపి గిన్నెలో ఉంచి,తడిబట్టతో కప్పి రెండు గంటలపాటు నాననివ్వాలి.
  • అలసందలు శుభ్రంచేసి ఒకరోజు ముందే కడిగి నానబెట్టాలి.
  • తరవాతి రోజు నీళ్లు వంపేసి కుక్కర్లో ఉడికించి తీయాలి.
  • చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పోడిలా కొట్టాలి.
  • బాణలిలో బెల్లం వేసి పాకం పట్టి అందులో యాలకులపొడి వేయాలి.
  • అందులోనే కొద్దిగా నెయ్యి, బొబ్బర్ల పొడి, కోబ్బరి పొడి వేసి బాగా కలిపి ఆరాక కావలసిన సైజులో ముద్దలుగా చేయాలి.
  • మైదని చిన్న చిన్న ఉండలుగా చేసి అరచేతితి కిద్దిగా ఒత్తి అందులూ అలసందలముడ్డ పెట్టి నాలుగువైపుల పిండితో మూసేసి ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి రాసి అప్పడంల గుండ్రంగా చేతితోనే వత్తాలి.
  • స్టవ్ మీద పెనం పెట్టి సన్న సెగమీద నెయ్యి వేస్తూ అటూఇటూ తిప్పుతూ దోరగా కాల్చి తీయాలి.
పది రోజుల వరకూ తాజాగా ఉండే అలసందల బొబ్బట్లు పిల్లలకు మంచి పౌష్టికాహారం కూడా.... ...read more ⇒
| 0 comments |

Monday, January 12, 2009

Milk Cake

పండుగ సంధర్భంగా ఓ కొత్త రుచిని రుచిచూద్దాం..
మిల్క్ కేకు తయారుచేద్దాం..
  • కావలసినవి:
  • పాల పొడి-పావ్ కిలో
  • పంచదార-200గ్రా.
  • నెయ్యి-100గ్రా.
  • మైదా-50గ్రా.
  • యాలకుల పొడి- పావ్ స్పూన్
  • నీళ్లు- తగినన్ని
తయారుచేయు విధానం:
  • పంచదారలో తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టి పక్కన పెట్టాలి.
  • మందపాటి కళాయి తీసుకుని అందులో సగం నెయ్యి పోసి సన్న సెగమీద దోరరంగు వచ్చేవరకు వేఇంచి, అందులోపాకం పోసి అట్లకాడతో కలుపుతూ సన్న సెగమీద ఉదికిస్తూనే మిగిలిన నెయ్యి వెయ్యాలి.
  • అలాగే కలుపుతూ నెయ్యి పైకి తేలేవరకు ఉడికించి దించాలి.
  • నెయ్యి రాసిన వెడల్పాటి పళ్ళెంలోకి వంపి సమంగా సర్ది రెండు నిమిషాల తరవాత చాకుతో కావలిసిన ఆకారంలోముల్లాలుగా కోయాలి.
  • వీటి పైన అలంకారానికి జీడిపప్పు,బాదం పప్పు లేదా డ్రీ ఫ్రూట్స్ ఉపయోగించవచ్చు..
  • దీనితో పసంద్య్న మిల్క్ కేకు రెడీ..
  • బాగా ఆరిన తరువాత ముక్కలు విడదీసి డబ్బాలో సర్దితే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయ్..
ఈ సరి కొత్త రుచుల్లనే, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సంతోషాన్ని,తీపి గుర్తులని నింపాలని కోరుకుంటున్నా.. సంక్రాంతి శుభాకాంక్షలు! ...read more ⇒
| 0 comments |

Sunday, January 11, 2009

Fish Fry

రోజు ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావలసినవి:
  • చేపముక్కలు- 500 గ్రా.
  • నూనె- తగినంత
  • ఉప్పు-తగినంత
  • కార్న్ఫ్లోర్-2స్పూన్స్
  • వెనిగర్-2స్పూన్స్
  • ఉల్లిరసం- 2స్పూన్స్
  • కొత్తేమీర-2స్పూన్స్
  • అల్లంముద్దా- 1స్పూన్
  • పచ్చిమిర్చిపేస్ట్-1స్పూన్
  • కారం-1స్పూన్
  • మిరియాలపొడి- పావ్స్పూన్
  • గరంమసాల-పావ్స్పూన్
  • ఆరెంజ్రెడ్ఫుడ్కలర్-పావ్స్పూన్
తయారుచేయువిధానం:
  • కడిగినచేపముక్కలకుపసుపురాసిఉంచాలి.
  • వెడల్పాటిగిన్నెలోకార్న్ఫ్లోర్, వెనిగర్, ఉల్లిరసం, కొత్తేమీర, అల్లం-పచ్చిమిర్చిపేస్ట్, కారం, మసాలపొడి, మిరియాలపొడి, ఫుడ్కలర్, ఉప్పు, తగినన్నినీళ్లుపోసిచిక్కటిపేస్ట్చేయాలి.
  • చేపముక్కలకిరెండుపక్కలాపట్టించిగంటసేపుఊరనివ్వాలి.
  • కళైలోనూనెపోసికాగినతరువాతచేపముక్కల్నిఒక్కొక్కటిగావేస్తూవేఇంచితీయాలి..
...read more ⇒
| 0 comments |

Thursday, January 8, 2009

Beetroot Boorelu

పండుగ సమయం దగ్గర పడుతుంది. ఎప్పటిలా కాకుండా సంక్రాంతిని కొంచెం సరికొత్త రుచులతోఆస్వాదిద్దాం.. దానిలో భాగంగా బీట్రూట్ బూరెలు ఎలా తాయారు చేయాలో చూద్దాం...
కావలసినవి:
  • పచ్చి బియ్యం పిండి- 1 కేజీ
  • నీళ్లు-తగినన్ని
  • రిఫైండ్ ఆయిల్- తగినంత
  • బెల్లం తురుము- ముప్పావు కేజీ
  • బీట్రూట్ తురుము- 300 గ్రాములు
  • నెయ్యి- 150 గ్రా.
  • ఎండు కొబ్బరి తురుము- 200 గ్రా.
  • యాలకుల పొడి- ఒకటిన్నర స్పూన్
తయారుచేయు విధానం:
  • ముందుగ బీట్రూట్ తురుములో కొద్దిగా నెయ్యి వేసి నీళ్లు ఇంకే వరకు వేఇంచి ఉంచాలి.
  • మందపాటి గిన్నెలో బెల్లం తురుము,తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం పట్టాలి.
  • పాకంలో యాలకుల పొడి వేసి గిన్నె దించాలి.
  • తరువాత బూరెలు,అరిసెల తయారి మాదిరిగానే పాకంలో చేత్తో పిండి పోస్తూ, మరో చేత్తో గరిటెతో పిండి ఉండలు కట్టకుండా బాగా తిప్పాలి.
  • ఇలా మొత్తం పిండి వేసిన తరువాత నెయ్యి, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి 20 నిమిషాల పాటు మూ పెట్టి ఉంచితే పిండి చక్కగా మగ్గుతుంది.
  • కళాయిలో నూనె పోసి కాగనివ్వాలి. ఉడికించిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా ప్లాస్టిక్ పేపర్ మిద బూరెలు లేదా బిల్లల మాదిరిగా వత్తి నూనెలో వేఇంచి తీయాలి..
దీనితో బీట్రూట్ బూరెలు రెడీ.. బీట్రూట్ బూరెల్లో పోషకవిలువలు కూడా ఉన్నాయ్.. కాబట్టి పిల్లలకి బూరెలు తినిపిస్తే tasty foodతో పాటు healthy food ని కూడా అందించిన వారౌతారు.. ఇవి 15 రోజుల వరకు నల్వ ఉంటాయ్..
...read more ⇒
| 0 comments |

Wednesday, January 7, 2009

Palak pulao

పాలక్ పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావలసినవి:

  • భాసుమతి బియ్యం- కప్పు
  • పాల కూర- 75 గ్రాములు
  • ఉల్లిపాయ- ఒకటి
  • అల్లం- చిన్న ముక్క
  • వెల్లుల్లి-6 రేకులు
  • మంచి నీళ్లు- అర లీటర్
  • నూనె- ఒకటిన్నర స్పూన్
  • జీడి పప్పు- 10
  • పచ్చి మిర్చి- 2
  • గరం మసాల- అర స్పూన్
  • యాలకుల పొడి- అర స్పూన్
  • లవంగాల పొడి- చిటికెడు
  • ఉప్పు- తగినంత
  • నిమ్మరసం- ఒక స్పూన్
  • టమాట- ఒకటి
తయారుచేయు విధానం:
  • పాల కూర, ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. కొద్దిగా నీళ్లు కూడా వేయాలి.
  • పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. జీడిపప్పు, బియ్యం వేసి రెండు నిమిషాలు వేఇంచాలి.
  • పచ్చి మిర్చి, గరం మసాల, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడులు, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంట మిద ఉడికించాలి.
  • తరువాత మెత్తగా రుబ్బి పెట్టుకున్న పాల కూర పేస్టు కూడా వేసి మరో పది నిమిషాలు సిమ్లో ఉంచాలి.
  • చివరగా నిమ్మ రసం పిండి సారి కలిపితే పాలక్ పలావ్ రెడీ....

...read more ⇒