| |

Friday, January 16, 2009

Dhliya poori

ఎప్పుడూ ఒకే రకమైన పూరి కాకుండా కొత్త రకమైన రుచిని ధలియా పూరీతో రుచి చూడొచ్చు...
కావలిసినవి:
  • ధలియా-అరకేజీ
  • పంచదార- అరకేజీ
  • యాలకులు- ఆరు
  • మైదా- ముప్పావ్ కేజీ
  • నీళ్లు-లీటర్
తయారుచేయు విధానం:
  • మైదాపిండిలో నీళ్లు వేసి ముద్దలా అయిన తరువాత నూనె పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి.
  • పిండిని అరగంటసేపు నాననివ్వాలి.
  • తరువాత లీటర్నీళ్ళను మరగపెట్టాలి, మరుగుతున్నపుడే అరకేజీ ధలియ( గోధుమ రవ్వలాంటిది బయట మార్కెట్లో దొరుకుతుంది) వేసి ఉడికించాలి.
  • నీళ్లు పూర్తిగా ఇంకిపోయాక, పంచదార వెసి ధలియ దగ్గర పడేదాకా ఉడికించాలి.
  • ధలియాని చల్లారనివ్వాలి.
  • కలిపీ ఉంచుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • వీటి మద్యన చల్లారిన ధలియా మిశ్రమాన్ని పెట్టి,అన్ని వ్య్పులా మూసేసి పూరీల మాదిరి ఒత్తుకోవాలి.
  • తరువాత నూనెలో దోరగా వేఇంచి తీయాలి..
ఇవి నాలుగురోజుల వరకు నిల్వ ఉంటాయ్..

No comments: