| |

Monday, January 12, 2009

Milk Cake

పండుగ సంధర్భంగా ఓ కొత్త రుచిని రుచిచూద్దాం..
మిల్క్ కేకు తయారుచేద్దాం..
  • కావలసినవి:
  • పాల పొడి-పావ్ కిలో
  • పంచదార-200గ్రా.
  • నెయ్యి-100గ్రా.
  • మైదా-50గ్రా.
  • యాలకుల పొడి- పావ్ స్పూన్
  • నీళ్లు- తగినన్ని
తయారుచేయు విధానం:
  • పంచదారలో తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టి పక్కన పెట్టాలి.
  • మందపాటి కళాయి తీసుకుని అందులో సగం నెయ్యి పోసి సన్న సెగమీద దోరరంగు వచ్చేవరకు వేఇంచి, అందులోపాకం పోసి అట్లకాడతో కలుపుతూ సన్న సెగమీద ఉదికిస్తూనే మిగిలిన నెయ్యి వెయ్యాలి.
  • అలాగే కలుపుతూ నెయ్యి పైకి తేలేవరకు ఉడికించి దించాలి.
  • నెయ్యి రాసిన వెడల్పాటి పళ్ళెంలోకి వంపి సమంగా సర్ది రెండు నిమిషాల తరవాత చాకుతో కావలిసిన ఆకారంలోముల్లాలుగా కోయాలి.
  • వీటి పైన అలంకారానికి జీడిపప్పు,బాదం పప్పు లేదా డ్రీ ఫ్రూట్స్ ఉపయోగించవచ్చు..
  • దీనితో పసంద్య్న మిల్క్ కేకు రెడీ..
  • బాగా ఆరిన తరువాత ముక్కలు విడదీసి డబ్బాలో సర్దితే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయ్..
ఈ సరి కొత్త రుచుల్లనే, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సంతోషాన్ని,తీపి గుర్తులని నింపాలని కోరుకుంటున్నా.. సంక్రాంతి శుభాకాంక్షలు!

No comments: