| |

Thursday, January 15, 2009

Mutton Pulao

అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు! మటన్ పలావ్ ఎలా తయారుచేయాలో ఈ రోజు చూద్దాం..
కావలసినవి:
  • మటన్- ముప్పావ్ కిలో
  • బియ్యం- మూడు కప్పులు
  • ఉల్లిపాయ- ఒకటి
  • అల్లం- చిన్నముక్క
  • వెల్లుల్లి రెబ్బలు- ఆరు
  • షాజీర- స్పూన్
  • ధనియాలు- స్పూన్
  • మిరియాలు- స్పూన్
  • లవంగాలు- ఆరు
  • యాలకులు- రెండు
  • దాల్చిన చెక్క- రెండు
  • పలావ్ ఆకులు- రెండు
  • నెయ్యి- రెండు స్పూన్స్
  • ఉప్పు- తగినంత
తయారుచేయు విధానం:
  • పాన్లో కడిగిన మాంసం ముక్కలు, బిర్యాని మసాలాలు, ఉప్పు, ఆరు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి.
  • 20 నిమిషాల పాటు ఉడికించి తరవాత మాంసం ముక్కల్ని విడిగా తీసి ఆరబెట్టాలి.
  • మసాలల్ని కూడా తీసి మెత్తగా మెదపాలి.
  • మాంసంలోనుండి వచ్చిన నీళ్ళని పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేసి, ఉల్లిపాయ ముక్కలు వేఇంచాలి. తరువాత మసాలాలు, మాంసం అన్నీ వేసికొద్దిసేపు వేఇంచాలి.
  • తరువాత పక్కకు తీసి ఉంచిన మాంసం నీళ్లు పోసి మరిగాక కడిగి ఉంచిన బియ్యం వేసి ఉడికించాలి.
అంతే వేడివేడి మటన్ పలావ్ రెడీ..
దీన్ని
పెరుగు చట్నీతో వడ్డిస్తే బాగుంటుంది..

No comments: