| |

Tuesday, January 13, 2009

Alasandala bobbatlu

ముందుగా అందరికీ సంక్రాంటి శుభాకాంక్షలు!
రోజు అలసందలుతో బొబ్బట్లు ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసినవి
:
  • మైదా- కిలో
  • అలసందలు- కిలో
  • బెల్లంతురుము- ముప్పావ్కిలో
  • నెయ్యి - పావ్కిలో
  • కొబ్బరిపొడి-100 గ్రా.
  • యాలకులు-15 పొడికొట్టాలి
  • రిఫైండ్ఆయిల్- అరకప్పు
  • ఉప్పు- తగినంత
  • నీళ్లు- తగినన్ని
తయారుచేయు విధానం:
  • మైదాలో ఉప్పు, నూనె లేదా నెయ్యి వీసి తగినన్ని నీళ్లు పోసి చపాతిముద్దలా కలిపి గిన్నెలో ఉంచి,తడిబట్టతో కప్పి రెండు గంటలపాటు నాననివ్వాలి.
  • అలసందలు శుభ్రంచేసి ఒకరోజు ముందే కడిగి నానబెట్టాలి.
  • తరవాతి రోజు నీళ్లు వంపేసి కుక్కర్లో ఉడికించి తీయాలి.
  • చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పోడిలా కొట్టాలి.
  • బాణలిలో బెల్లం వేసి పాకం పట్టి అందులో యాలకులపొడి వేయాలి.
  • అందులోనే కొద్దిగా నెయ్యి, బొబ్బర్ల పొడి, కోబ్బరి పొడి వేసి బాగా కలిపి ఆరాక కావలసిన సైజులో ముద్దలుగా చేయాలి.
  • మైదని చిన్న చిన్న ఉండలుగా చేసి అరచేతితి కిద్దిగా ఒత్తి అందులూ అలసందలముడ్డ పెట్టి నాలుగువైపుల పిండితో మూసేసి ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి రాసి అప్పడంల గుండ్రంగా చేతితోనే వత్తాలి.
  • స్టవ్ మీద పెనం పెట్టి సన్న సెగమీద నెయ్యి వేస్తూ అటూఇటూ తిప్పుతూ దోరగా కాల్చి తీయాలి.
పది రోజుల వరకూ తాజాగా ఉండే అలసందల బొబ్బట్లు పిల్లలకు మంచి పౌష్టికాహారం కూడా....

No comments: