| |

Wednesday, January 7, 2009

Palak pulao

పాలక్ పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావలసినవి:

  • భాసుమతి బియ్యం- కప్పు
  • పాల కూర- 75 గ్రాములు
  • ఉల్లిపాయ- ఒకటి
  • అల్లం- చిన్న ముక్క
  • వెల్లుల్లి-6 రేకులు
  • మంచి నీళ్లు- అర లీటర్
  • నూనె- ఒకటిన్నర స్పూన్
  • జీడి పప్పు- 10
  • పచ్చి మిర్చి- 2
  • గరం మసాల- అర స్పూన్
  • యాలకుల పొడి- అర స్పూన్
  • లవంగాల పొడి- చిటికెడు
  • ఉప్పు- తగినంత
  • నిమ్మరసం- ఒక స్పూన్
  • టమాట- ఒకటి
తయారుచేయు విధానం:
  • పాల కూర, ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. కొద్దిగా నీళ్లు కూడా వేయాలి.
  • పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. జీడిపప్పు, బియ్యం వేసి రెండు నిమిషాలు వేఇంచాలి.
  • పచ్చి మిర్చి, గరం మసాల, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడులు, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంట మిద ఉడికించాలి.
  • తరువాత మెత్తగా రుబ్బి పెట్టుకున్న పాల కూర పేస్టు కూడా వేసి మరో పది నిమిషాలు సిమ్లో ఉంచాలి.
  • చివరగా నిమ్మ రసం పిండి సారి కలిపితే పాలక్ పలావ్ రెడీ....

No comments: