| 0 comments |

Sunday, May 31, 2009

MANGO MILK SHAKE


కావలసినవి:
  • మామిడిపళ్ళు-2
  • పాలు-4 కప్పులు
  • చక్కర-పావ్ కప్పు
  • యాలకుల పొడి-1 స్పూన్
తయారుచేయు విధానం:
  • మమిద్దిపల్లు చెక్కు తీసి,ముక్కలుగా కోసి మిక్సీలో బ్లెండ్ చేయాలి.
  • తరువాత పాలు,చెక్కెర,యాలకుల పొడి వేసి మల్ల బ్లెండ్ చేయాలి.
  • దీనిని ఫ్రిజ్లో ఉంచి చల్లబడిన తరువాత తాగాలి.
...read more ⇒
| 0 comments |

Thursday, April 9, 2009

SUMMER MAGIC


కావలసినవి:
  • ఖర్భూజా-సగం
  • దానిమ్మ-పావు
  • నిమ్మరసం-సరిపడినంత
  • ఐస్ క్యూబ్స్-సరిపడినన్ని
తయారుచేయు విధానం:
  • ఖర్భూజా ,దానిమ్మ కాయల పైన తొక్క తీసివేసి విడివిడిగా మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి.
  • ఖర్భూజా,దానిమ్మ గింజల జ్యూస్కు నిమ్మరసం జతచేసి మిక్సీలో మరో రెండు నిమిషాలు బ్లెండ్ చేయాలి.
...read more ⇒
| 0 comments |

Tuesday, April 7, 2009

SAGO IDLY


కావలసినవి:
  • సగ్గుబియ్యం- కప్పులు
  • పుల్లని మజ్జిగ-కప్పులు
  • ఉల్లిపాయ-1
  • పచ్చిమిర్చి-2
  • ఉప్పు-స్పూన్లు
  • ఆవాలు-అర స్పూన్
  • మినపప్పు-అర స్పూన్
  • సెనగపప్పు-అర స్పూన్
  • కరివేపాకు-కట్ట
  • కొత్తిమీర-కట్ట
  • ఇంగువ-చిటికెడు
  • నూనె-స్పూన్లు
తయారుచేయు విధానం:
  • సగ్గుబియ్యం పుల్లని మజ్జిగలో కనీసం ఐదారు గంటలు నానబెట్టాలి. (మజ్జిగ మరీ పలుచగా కానీ చిక్కగా కానీ ఉండకూడదు)
  • ఉల్లుపాయ,పచ్చిమిర్చి,కరివేపాకుల్ని సన్నగా తరగాలి.
  • స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి కాయాలి. ఆవాలు,జీలకర్ర, సెనగపప్పు,మినపప్పు వేసి తాలింపు వేఇంచాలి.
  • తరువాత ఇందులోనే నానబెట్టిన సగ్గుబియ్యం పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
  • కొత్తిమీర సన్నగా తరిగి ఈ మిశ్రమంలో కలపాలి.
  • ఈ సగ్గుబియ్యం పిండిని ఇడ్లీ రేకుల్లో వేసి ఉడికించాలి.
  • (ఎక్కువసేపు ఉడికిస్తే ఇడ్లీ గట్టిపడవచ్చు.)
...read more ⇒
| 0 comments |

Thursday, March 26, 2009

MILK MYSOREPAK




కావలసినవి:
  • పాలపొడి-గ్రా.
  • మైదా-గ్రా.
  • పంచదార-గ్రా.
  • నెయ్యి-గ్రా
తయారుచేయువిధానం:
  • పాలపొడి,మైదాల్లోగ్రా.నెయ్యిపోసిమర్దించి, విడిగాఉంచాలి.
  • ఒకబాణలిలో పంచదార పోసి,అర లీటర్ నీళ్లు పోసి పాకం పట్టాలి.
  • తీగ పాకం అవుతుండగా పాల పొడి,మైదా మిశ్రమాన్ని వేసి అట్లకాడతో కలియబెడుతుండాలి.
  • ఇప్పుడు వేడి చేసిన నెయ్యిని పంచదార పాకంలో నెమ్మదిగా పోస్తూ కలియబెట్టాలి.
  • మిశ్రమం దగ్గరగా,చిక్కగా అవ్తున్నపుడు బాణలిని దించి, ఆ మిశ్రమాన్ని పళ్ళెంలో పోసి చల్లారాక ముక్కలుగా కోయాలి.
...read more ⇒
| 1 comments |

Tuesday, February 10, 2009

Bread halwa

బ్రెడ్ తో రుచికరమైన స్వీట్స్ కూడా చేయొచ్చు.. అదెలాగో రోజు చూద్దాం..
కావలసినవి:
  • బ్రెడ్-మీడియం సైజు ప్యాక్
  • మంచి నీళ్లు-ఒకటిన్నర లీటర్
  • పంచదార-ఒక కేజీ
  • కలాకండ్ పొడి-పావ్ కేజీ
  • నెయ్యి-200 గ్రా.
  • రిఫైండ్ ఆయిల్-200 గ్రా.
  • జీడిపప్పు-75 గ్రా.
  • యాలకుల పొడి-స్పూన్
  • కేసరి ఫుడ్ కలర్-పావ్ స్పూన్
  • పచ్చ కర్పూరం-పావ్ స్పూన్
తయారుచేయు విధానం:
  • కొద్దిగా నెయ్యి వేసి జీడి పప్పు దోరగా వేఇంచి ఉంచాలి.
  • పంచదార పాకం పట్టి అందులో పచ్చ కర్పూరం,యాలకుల పొడి కలిపి పెట్టుకోవాలి.
  • బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • నూనె,నెయ్యి సమ పాళ్ళలో తీసుకుని,దానిలో బ్రెడ్ ముక్కల్ని దోరగా వేఇంచాలి.
  • అందులో మంచి నీళ్లు పోసి కేసరి రంగు,కలాకండ్ పొడి వేసి కలుపుతూ ఉడికించాలి.
  • ఈ మిశ్రం చిక్కపడుతుండగా పంచదార పాకం,జీడి పప్పు( గింజలు తీసిన ఎండు కర్జూరాలు కూడా నచ్చితేవేసుకోవచ్చు) వేసి మిగిలిన నెయ్యి కూడా వేసి సన్నని సెగ మీద ఉడికించి దించాలి.
ఎండు ద్రాక్ష,చెర్రీలు వేసి అలంకరించి వడ్డిస్తే చాల బాగుంటుంది.. ...read more ⇒
| 0 comments |

Monday, February 9, 2009

Veg 65

రోజు వెజ్ 65 ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసినవి:
  • క్యారెట్-100 గ్రాములు
  • బీన్స్-100 గ్రా.
  • క్యాబేజీ-150 గ్రా.

  • క్యాప్సికం-75 గ్రా.
  • కార్న్ ఫ్లోర్ -2 స్పూన్లు
  • మైదా-50 గ్రా.
  • అల్లం వెల్లుల్లి-2 స్పూన్లు
  • ఉప్పు-తగినంత
  • మిరియాల పొడి-చిటికెడు
  • రిఫైండ్ ఆయిల్-సరిపడా
  • పచ్చిమిర్చి-30 గ్రా.
  • కరివేపాకు-తగినంత
  • పెరుగు-2 కప్పులు
  • రెడ్ ఆరెంజ్ కలర్-చిటికెడు
తయారుచేయు విధానం:
  • కాయగూరాలన్నీ సన్నటి ముక్కలుగా తరిగి నీటిలో ఉడికించి,నీరు పిండి గిన్నెలో వేయాలి.
  • దీనిలో కార్న్ ఫ్లోర్ ,మైదా,ఉప్పు,అల్లం వెల్లుల్లి ముద్దా,మిరియాల పొడి కలిపి కొంచిం నీళ్లు కలిపి ముద్దలా చేసుకోవాలి.
  • ముద్దలో కరివేపాకు కలిపి ఉండలుగా చేయాలి.
  • వీటిని వేడి నూనెలో ఎర్రగా ఫ్రై చేయాలి.
  • ఒక బాణలిలో కొంచెం నూనె పోసి అడ్డంగా చీల్చిన పచ్చిమిర్చి,కరివేపాకు వేసి బాగా వేఇంచి,తీయాలి.
  • తరువాత బాణలిలో కొంచెం నూనె పోసి,పెరుగు పోయాలి. దీనిలో ఆరెంజ్ కలర్ కూడా కలపాలి.
  • మిశ్రమాన్ని సగం అయ్యే వరకు గరిటెతో కలపాలి.
  • దీనిలో ఫ్రై చేసిపెట్టుకున్న ఉండల్ని వేసి బాగా ఫ్రై చేయాలి.
చివరగా వేఇంచుకున్న పచ్చిమిర్చి,కరివేపాకు వేస్తే రుచికరమైన వెజ్ 65 రెడీ.. ...read more ⇒
| 0 comments |

Friday, February 6, 2009

Veg masala

మాములు నూడుల్స్లా కాకుండా వీటికి మరికొన్ని పదార్ధాలని చేర్చి సరికొత్త రుచితో ఆరగించవచ్చు..
కావలసినవి:

  • నూడుల్స్-200 గ్రాములు

  • క్యాబేజీ తురుము-ఒక కప్పు


  • క్యారెట్ ముక్కలు-ఒక కప్పు

  • ఉల్లికాడ తురుము-ఒక కప్పు

  • పచ్చిమిర్చి-2

  • ఉప్పు-తగినంత

  • మసాల పొడి-స్పూన్

  • మంచి నీళ్లు-అర లీటర్
తయారుచ్యు విధానం:

  • క్యారెట్లను చక్రాల్లా కోసుకోవాలి.

  • బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి.

  • దీనిలో క్యారెట్ ముక్కలు,క్యాబేజీ తురుము వేసి సగం ఉడికిన తరువాత నూడుల్స్ వేయాలి.

  • ఇవి కూడా ఉడికిన తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి,ఉల్లికాడ తురుము,ఉప్పు,మసాల పొడి వేసి నీళ్లన్నీఇంకిపోయే వరకు ఉంచి దించాలి.
దీన్ని వేడివేడిగా అలానే తినవచ్చు లేదా టమాటా సాస్తో కానీ గ్రీన్ సలాడ్ తో గని తింటే బాగుంటుంది..
...read more ⇒
| 0 comments |

Thursday, February 5, 2009

Soya Cutlet


కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా,పోషక విలువలు ఎక్కువగా ఉండే రుచికరమైన

సోయా కట్లెట్ తయారి ఈ రోజుచూద్దాం..

కావలసినవి:
  • సోయా గుళికలు-50 గ్రాములు
  • బీన్స్-100 గ్రా.
  • ఉడికించిన బంగాళా దుంపలు-50 గ్రా.
  • తురిమిన క్యారెట్-50 గ్రా.
  • తరిగిన క్యాబేజీ-50 గ్రా.
  • ఉల్లిపాయలు-50 గ్రా.
  • పసుపు-పావ్ స్పూన్
  • ఎండుమిర్చి కారం-అర స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-అర స్పూన్
  • ఉప్పు-తగినంత
  • నూనె-2 స్పూన్లు
  • కొత్తిమీర -తగినంత
  • గుడ్డు-ఒకటి
  • గోధుమ పిండి-చల్లడానికి సరిపడా
తయారుచేయు విధానం:
  • అరకప్పు నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి.
  • అందులో సోయా గుళికలు వేసి పది నిమిషాలు ఉడికించి దించాలి.
  • నాన్ స్టిక్ పాన్లో ఒక స్పూన్ నూనె వేసి,ఉల్లిపాయ ముక్కలు వేఇంచాలి.
  • ఇవి గోధుమ రంగులోకి వచ్చాక పసుపు,అల్లం వెల్లుల్లి ముద్దా,కారం,ఉప్పు వేసి వేఇంచాలి.
  • తరువాత సన్నగా తరిగిన బీన్స్,క్యారెట్,క్యాబేజీ,కొత్తిమీర వేసి నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి.
  • అందులో సోయా గుళికలు,మెత్తగా చేసిన బంగాళా దుంపలు వేసి గట్టిపడే వరకు ఉడికించాలి.
  • ఇది చల్లారిన తరువాత చిన్న ఉండలుగా చేయాలి.
  • వీటిని గిలకొట్టిన గుడ్డులో ముంచి గోధుమ పిండిలో అద్ది తరువాత చేతితి వొత్తాలి.
  • తరువాత పెనం వేడి చేసి నూనె పోసి,కట్లెట్ రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.
దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు,పీచు పదార్ధాలు,విటమిన్లు పుష్కలంగా ఉంటాయ్.. ...read more ⇒
| 0 comments |

Wednesday, February 4, 2009

Afgani Pulao

అఫ్గాని పలావ్ ఎలా తయారుచేయాలో ఈ రోజు చూద్దాం..
కావలసినవి:
  • మటన్ లేదా చికెన్-కిలో
  • బియ్యం-కిలో
  • నానబెట్టిన సెనగపప్పు-అర కప్పు
  • పెరుగు-పావ్ కిలో
  • ఉల్లిపాయలు-రెండు
  • అల్లం వెల్లుల్లి-రెండు స్పూన్లు
  • గరం మసాల-రెండు స్పూన్లు
  • ఉప్పు-తగినంత
  • నెయ్యి లేదా నూనె -సరిపడా
తయారుచేయు విధానం:
  • బాణలిలో సరిపడా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేఇంచాలి.
  • ఈ ముక్కలు చల్లరిపోయక పెస్ట్ల చేయాలి.
  • ఇపుడు ఆ బాణలిలో చికెన్ ముక్కలు వేసి ఎర్రగా వేఇంచాలి.
  • తరువాత పెరుగు గిలకొట్టి ఈ ముక్కల్లో వేసి,స్పూన్ అల్లం వెల్లుల్లో ముద్దా కూడా వేసి వేఇంచాలి.
  • తగినన్ని నీళ్లు పోసి ,ఇది మెత్తబడేవరకు ఉడికించాలి.
  • తరువాత దీనిలో సెనగపప్పు,ఉల్లిపాయ ముద్దా వేసి నీళ్లు ఇంకిపోయేవరకు సిమ్లో ఉంచాలి.
  • నెయ్యి పైకి తేలాక స్పూన్ గరం మసాల వేయాలి.
  • కూర వండే సమయమ్లోనే విడిగా అన్నం వండాలి. ముందుగ ఎసరు నీళ్లు మరిగిన తరువాత ఓ స్పూన్ అల్లంవెల్లుల్లి,ఉప్పు,అర స్పూన్ గరం మసాల వేసి బియ్యం వేసి అన్నం పొడిగా ఉండేలా వండాలి.
  • ఇప్పుడు మిగిలిన గరం మసాల కూడా చల్లి,రెండు స్పూన్ల నెయ్యి లేదా నూనె వేయాలి.
అన్నాన్ని ఓ బౌల్లో వేసి దానిలో ఉడికించిన చికెన్ లేదా మటన్ ముక్కలు వేస్తే ఆఫ్గాన్ పలావ్ రెడీ... ...read more ⇒
| 0 comments |

Monday, February 2, 2009

Panjabi aloo fry

హాయ్ ఫ్రెండ్స్ రోజు పంజాబీ ఆలూ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసినవి:
  • బంగాళదుంపలు-అర కిలో
  • నూనె-తగినంత
  • పెరుగు-కప్పు
  • నీళ్లు-తగినన్ని
  • మైదా-స్పూన్
  • కార్న్ ఫ్లోర్-మూడు స్పూన్లు
  • కరివేపాకు-అరకప్పు
  • కొత్తేమీర తురుము-స్పూన్
  • అల్లం వెల్లుల్లి ముద్దా -స్పూన్
  • కారం-స్పూన్
  • మిరియాలపొడి-స్పూన్
  • పచ్చిమిర్చి-పది
  • ఉప్పు-తగినంత
  • ఫుడ్ కలర్-చిటికెడు
తయారుచేయు విధానం:
  • బంగాళ దుంపల్ని ఉడికించి తొక్క తీసి ముక్కలుగా కోయాలి.
  • గిన్నెలో కార్న్ ఫ్లోర్,మైదా,అల్లం వెల్లుల్లి ముద్దా,కారం,మిరియాల పొడి,ఉప్పు,ఫుడ్ కలర్,పెరుగు,కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి పేస్ట్ చేయాలి.
  • దీనిలో బంగాళ దుంప ముక్కల్ని ముంచి,పది నిమిషాల తరువాత నూనెలో దోరగా వేఇంచాలి.
  • కళైలో రెండు స్పూన్ల నూనె వేసి,కాగాక కరివేపాకు,పచ్చిమిర్చి వేసి వేఇంచి, దీనిలో వేఇంచిన బంగాళా దుంప ముక్కలు కూడా వేసి సిమ్లో ఉంచాలి.
  • కొంచెం నీళ్లు చల్లి,బాగా వేగిన తరువాత కొంచెం కారం,కొత్తేమీర చల్లాలి.
దీనితో రుచికరమైన పంజాబీ-ఆలూ ఫ్రై రెడీ.. ...read more ⇒
| 3 comments |

Friday, January 16, 2009

Carrot Paayasam

పోషక విలువలున్న క్యారెట్ పాయసం ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలిసినవి:
  • క్యారెట్-మూడు
  • పాలు-అరలీటర్
  • పంచదార-కప్పు
  • యాలకులు-తగినన్ని
  • జీడిపప్పు-తగినన్ని
తయారుచేయు విధానం:

  • క్యారేట్ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరగాలి.
  • తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి,తరువాత మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి.
  • ఇప్పుడు పాలని బాగా మరగనివ్వాలి,మరిగిన తరువాత క్యారెట్ ముద్దని వెయ్యాలి.
  • తరువాత పంచదార వేసి బాగా కలపాలి. యాలకుల పొడి కూడా వెయ్యాలి.
చివరగా జీడిపప్పు వేఇంచి దీనిలో కలిపితే రుచికరమైన , ఆరోగ్యకరమైన పాయసం రెడీ... ...read more ⇒
| 0 comments |

Dhliya poori

ఎప్పుడూ ఒకే రకమైన పూరి కాకుండా కొత్త రకమైన రుచిని ధలియా పూరీతో రుచి చూడొచ్చు...
కావలిసినవి:
  • ధలియా-అరకేజీ
  • పంచదార- అరకేజీ
  • యాలకులు- ఆరు
  • మైదా- ముప్పావ్ కేజీ
  • నీళ్లు-లీటర్
తయారుచేయు విధానం:
  • మైదాపిండిలో నీళ్లు వేసి ముద్దలా అయిన తరువాత నూనె పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి.
  • పిండిని అరగంటసేపు నాననివ్వాలి.
  • తరువాత లీటర్నీళ్ళను మరగపెట్టాలి, మరుగుతున్నపుడే అరకేజీ ధలియ( గోధుమ రవ్వలాంటిది బయట మార్కెట్లో దొరుకుతుంది) వేసి ఉడికించాలి.
  • నీళ్లు పూర్తిగా ఇంకిపోయాక, పంచదార వెసి ధలియ దగ్గర పడేదాకా ఉడికించాలి.
  • ధలియాని చల్లారనివ్వాలి.
  • కలిపీ ఉంచుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • వీటి మద్యన చల్లారిన ధలియా మిశ్రమాన్ని పెట్టి,అన్ని వ్య్పులా మూసేసి పూరీల మాదిరి ఒత్తుకోవాలి.
  • తరువాత నూనెలో దోరగా వేఇంచి తీయాలి..
ఇవి నాలుగురోజుల వరకు నిల్వ ఉంటాయ్.. ...read more ⇒
| 0 comments |

Thursday, January 15, 2009

Mutton Pulao

అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు! మటన్ పలావ్ ఎలా తయారుచేయాలో ఈ రోజు చూద్దాం..
కావలసినవి:
  • మటన్- ముప్పావ్ కిలో
  • బియ్యం- మూడు కప్పులు
  • ఉల్లిపాయ- ఒకటి
  • అల్లం- చిన్నముక్క
  • వెల్లుల్లి రెబ్బలు- ఆరు
  • షాజీర- స్పూన్
  • ధనియాలు- స్పూన్
  • మిరియాలు- స్పూన్
  • లవంగాలు- ఆరు
  • యాలకులు- రెండు
  • దాల్చిన చెక్క- రెండు
  • పలావ్ ఆకులు- రెండు
  • నెయ్యి- రెండు స్పూన్స్
  • ఉప్పు- తగినంత
తయారుచేయు విధానం:
  • పాన్లో కడిగిన మాంసం ముక్కలు, బిర్యాని మసాలాలు, ఉప్పు, ఆరు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి.
  • 20 నిమిషాల పాటు ఉడికించి తరవాత మాంసం ముక్కల్ని విడిగా తీసి ఆరబెట్టాలి.
  • మసాలల్ని కూడా తీసి మెత్తగా మెదపాలి.
  • మాంసంలోనుండి వచ్చిన నీళ్ళని పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేసి, ఉల్లిపాయ ముక్కలు వేఇంచాలి. తరువాత మసాలాలు, మాంసం అన్నీ వేసికొద్దిసేపు వేఇంచాలి.
  • తరువాత పక్కకు తీసి ఉంచిన మాంసం నీళ్లు పోసి మరిగాక కడిగి ఉంచిన బియ్యం వేసి ఉడికించాలి.
అంతే వేడివేడి మటన్ పలావ్ రెడీ..
దీన్ని
పెరుగు చట్నీతో వడ్డిస్తే బాగుంటుంది..
...read more ⇒
| 0 comments |

Tuesday, January 13, 2009

Alasandala bobbatlu

ముందుగా అందరికీ సంక్రాంటి శుభాకాంక్షలు!
రోజు అలసందలుతో బొబ్బట్లు ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసినవి
:
  • మైదా- కిలో
  • అలసందలు- కిలో
  • బెల్లంతురుము- ముప్పావ్కిలో
  • నెయ్యి - పావ్కిలో
  • కొబ్బరిపొడి-100 గ్రా.
  • యాలకులు-15 పొడికొట్టాలి
  • రిఫైండ్ఆయిల్- అరకప్పు
  • ఉప్పు- తగినంత
  • నీళ్లు- తగినన్ని
తయారుచేయు విధానం:
  • మైదాలో ఉప్పు, నూనె లేదా నెయ్యి వీసి తగినన్ని నీళ్లు పోసి చపాతిముద్దలా కలిపి గిన్నెలో ఉంచి,తడిబట్టతో కప్పి రెండు గంటలపాటు నాననివ్వాలి.
  • అలసందలు శుభ్రంచేసి ఒకరోజు ముందే కడిగి నానబెట్టాలి.
  • తరవాతి రోజు నీళ్లు వంపేసి కుక్కర్లో ఉడికించి తీయాలి.
  • చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పోడిలా కొట్టాలి.
  • బాణలిలో బెల్లం వేసి పాకం పట్టి అందులో యాలకులపొడి వేయాలి.
  • అందులోనే కొద్దిగా నెయ్యి, బొబ్బర్ల పొడి, కోబ్బరి పొడి వేసి బాగా కలిపి ఆరాక కావలసిన సైజులో ముద్దలుగా చేయాలి.
  • మైదని చిన్న చిన్న ఉండలుగా చేసి అరచేతితి కిద్దిగా ఒత్తి అందులూ అలసందలముడ్డ పెట్టి నాలుగువైపుల పిండితో మూసేసి ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి రాసి అప్పడంల గుండ్రంగా చేతితోనే వత్తాలి.
  • స్టవ్ మీద పెనం పెట్టి సన్న సెగమీద నెయ్యి వేస్తూ అటూఇటూ తిప్పుతూ దోరగా కాల్చి తీయాలి.
పది రోజుల వరకూ తాజాగా ఉండే అలసందల బొబ్బట్లు పిల్లలకు మంచి పౌష్టికాహారం కూడా.... ...read more ⇒
| 0 comments |

Monday, January 12, 2009

Milk Cake

పండుగ సంధర్భంగా ఓ కొత్త రుచిని రుచిచూద్దాం..
మిల్క్ కేకు తయారుచేద్దాం..
  • కావలసినవి:
  • పాల పొడి-పావ్ కిలో
  • పంచదార-200గ్రా.
  • నెయ్యి-100గ్రా.
  • మైదా-50గ్రా.
  • యాలకుల పొడి- పావ్ స్పూన్
  • నీళ్లు- తగినన్ని
తయారుచేయు విధానం:
  • పంచదారలో తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టి పక్కన పెట్టాలి.
  • మందపాటి కళాయి తీసుకుని అందులో సగం నెయ్యి పోసి సన్న సెగమీద దోరరంగు వచ్చేవరకు వేఇంచి, అందులోపాకం పోసి అట్లకాడతో కలుపుతూ సన్న సెగమీద ఉదికిస్తూనే మిగిలిన నెయ్యి వెయ్యాలి.
  • అలాగే కలుపుతూ నెయ్యి పైకి తేలేవరకు ఉడికించి దించాలి.
  • నెయ్యి రాసిన వెడల్పాటి పళ్ళెంలోకి వంపి సమంగా సర్ది రెండు నిమిషాల తరవాత చాకుతో కావలిసిన ఆకారంలోముల్లాలుగా కోయాలి.
  • వీటి పైన అలంకారానికి జీడిపప్పు,బాదం పప్పు లేదా డ్రీ ఫ్రూట్స్ ఉపయోగించవచ్చు..
  • దీనితో పసంద్య్న మిల్క్ కేకు రెడీ..
  • బాగా ఆరిన తరువాత ముక్కలు విడదీసి డబ్బాలో సర్దితే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయ్..
ఈ సరి కొత్త రుచుల్లనే, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సంతోషాన్ని,తీపి గుర్తులని నింపాలని కోరుకుంటున్నా.. సంక్రాంతి శుభాకాంక్షలు! ...read more ⇒
| 0 comments |

Sunday, January 11, 2009

Fish Fry

రోజు ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావలసినవి:
  • చేపముక్కలు- 500 గ్రా.
  • నూనె- తగినంత
  • ఉప్పు-తగినంత
  • కార్న్ఫ్లోర్-2స్పూన్స్
  • వెనిగర్-2స్పూన్స్
  • ఉల్లిరసం- 2స్పూన్స్
  • కొత్తేమీర-2స్పూన్స్
  • అల్లంముద్దా- 1స్పూన్
  • పచ్చిమిర్చిపేస్ట్-1స్పూన్
  • కారం-1స్పూన్
  • మిరియాలపొడి- పావ్స్పూన్
  • గరంమసాల-పావ్స్పూన్
  • ఆరెంజ్రెడ్ఫుడ్కలర్-పావ్స్పూన్
తయారుచేయువిధానం:
  • కడిగినచేపముక్కలకుపసుపురాసిఉంచాలి.
  • వెడల్పాటిగిన్నెలోకార్న్ఫ్లోర్, వెనిగర్, ఉల్లిరసం, కొత్తేమీర, అల్లం-పచ్చిమిర్చిపేస్ట్, కారం, మసాలపొడి, మిరియాలపొడి, ఫుడ్కలర్, ఉప్పు, తగినన్నినీళ్లుపోసిచిక్కటిపేస్ట్చేయాలి.
  • చేపముక్కలకిరెండుపక్కలాపట్టించిగంటసేపుఊరనివ్వాలి.
  • కళైలోనూనెపోసికాగినతరువాతచేపముక్కల్నిఒక్కొక్కటిగావేస్తూవేఇంచితీయాలి..
...read more ⇒