| |

Tuesday, February 10, 2009

Bread halwa

బ్రెడ్ తో రుచికరమైన స్వీట్స్ కూడా చేయొచ్చు.. అదెలాగో రోజు చూద్దాం..
కావలసినవి:
  • బ్రెడ్-మీడియం సైజు ప్యాక్
  • మంచి నీళ్లు-ఒకటిన్నర లీటర్
  • పంచదార-ఒక కేజీ
  • కలాకండ్ పొడి-పావ్ కేజీ
  • నెయ్యి-200 గ్రా.
  • రిఫైండ్ ఆయిల్-200 గ్రా.
  • జీడిపప్పు-75 గ్రా.
  • యాలకుల పొడి-స్పూన్
  • కేసరి ఫుడ్ కలర్-పావ్ స్పూన్
  • పచ్చ కర్పూరం-పావ్ స్పూన్
తయారుచేయు విధానం:
  • కొద్దిగా నెయ్యి వేసి జీడి పప్పు దోరగా వేఇంచి ఉంచాలి.
  • పంచదార పాకం పట్టి అందులో పచ్చ కర్పూరం,యాలకుల పొడి కలిపి పెట్టుకోవాలి.
  • బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • నూనె,నెయ్యి సమ పాళ్ళలో తీసుకుని,దానిలో బ్రెడ్ ముక్కల్ని దోరగా వేఇంచాలి.
  • అందులో మంచి నీళ్లు పోసి కేసరి రంగు,కలాకండ్ పొడి వేసి కలుపుతూ ఉడికించాలి.
  • ఈ మిశ్రం చిక్కపడుతుండగా పంచదార పాకం,జీడి పప్పు( గింజలు తీసిన ఎండు కర్జూరాలు కూడా నచ్చితేవేసుకోవచ్చు) వేసి మిగిలిన నెయ్యి కూడా వేసి సన్నని సెగ మీద ఉడికించి దించాలి.
ఎండు ద్రాక్ష,చెర్రీలు వేసి అలంకరించి వడ్డిస్తే చాల బాగుంటుంది..

1 comment:

chandu said...

write my favourite dish carrot halwa