| |

Wednesday, February 4, 2009

Afgani Pulao

అఫ్గాని పలావ్ ఎలా తయారుచేయాలో ఈ రోజు చూద్దాం..
కావలసినవి:
  • మటన్ లేదా చికెన్-కిలో
  • బియ్యం-కిలో
  • నానబెట్టిన సెనగపప్పు-అర కప్పు
  • పెరుగు-పావ్ కిలో
  • ఉల్లిపాయలు-రెండు
  • అల్లం వెల్లుల్లి-రెండు స్పూన్లు
  • గరం మసాల-రెండు స్పూన్లు
  • ఉప్పు-తగినంత
  • నెయ్యి లేదా నూనె -సరిపడా
తయారుచేయు విధానం:
  • బాణలిలో సరిపడా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేఇంచాలి.
  • ఈ ముక్కలు చల్లరిపోయక పెస్ట్ల చేయాలి.
  • ఇపుడు ఆ బాణలిలో చికెన్ ముక్కలు వేసి ఎర్రగా వేఇంచాలి.
  • తరువాత పెరుగు గిలకొట్టి ఈ ముక్కల్లో వేసి,స్పూన్ అల్లం వెల్లుల్లో ముద్దా కూడా వేసి వేఇంచాలి.
  • తగినన్ని నీళ్లు పోసి ,ఇది మెత్తబడేవరకు ఉడికించాలి.
  • తరువాత దీనిలో సెనగపప్పు,ఉల్లిపాయ ముద్దా వేసి నీళ్లు ఇంకిపోయేవరకు సిమ్లో ఉంచాలి.
  • నెయ్యి పైకి తేలాక స్పూన్ గరం మసాల వేయాలి.
  • కూర వండే సమయమ్లోనే విడిగా అన్నం వండాలి. ముందుగ ఎసరు నీళ్లు మరిగిన తరువాత ఓ స్పూన్ అల్లంవెల్లుల్లి,ఉప్పు,అర స్పూన్ గరం మసాల వేసి బియ్యం వేసి అన్నం పొడిగా ఉండేలా వండాలి.
  • ఇప్పుడు మిగిలిన గరం మసాల కూడా చల్లి,రెండు స్పూన్ల నెయ్యి లేదా నూనె వేయాలి.
అన్నాన్ని ఓ బౌల్లో వేసి దానిలో ఉడికించిన చికెన్ లేదా మటన్ ముక్కలు వేస్తే ఆఫ్గాన్ పలావ్ రెడీ...

No comments: