కావలసినవి:
- క్యారెట్-100 గ్రాములు
- బీన్స్-100 గ్రా.
- క్యాబేజీ-150 గ్రా.

- క్యాప్సికం-75 గ్రా.
- కార్న్ ఫ్లోర్ -2 స్పూన్లు
- మైదా-50 గ్రా.
- అల్లం వెల్లుల్లి-2 స్పూన్లు
- ఉప్పు-తగినంత
- మిరియాల పొడి-చిటికెడు
- రిఫైండ్ ఆయిల్-సరిపడా
- పచ్చిమిర్చి-30 గ్రా.
- కరివేపాకు-తగినంత
- పెరుగు-2 కప్పులు
- రెడ్ ఆరెంజ్ కలర్-చిటికెడు
- కాయగూరాలన్నీ సన్నటి ముక్కలుగా తరిగి నీటిలో ఉడికించి,నీరు పిండి ఓ గిన్నెలో వేయాలి.
- దీనిలో కార్న్ ఫ్లోర్ ,మైదా,ఉప్పు,అల్లం వెల్లుల్లి ముద్దా,మిరియాల పొడి కలిపి కొంచిం నీళ్లు కలిపి ముద్దలా చేసుకోవాలి.
- ఈ ముద్దలో కరివేపాకు కలిపి ఉండలుగా చేయాలి.
- వీటిని వేడి నూనెలో ఎర్రగా ఫ్రై చేయాలి.
- ఒక బాణలిలో కొంచెం నూనె పోసి అడ్డంగా చీల్చిన పచ్చిమిర్చి,కరివేపాకు వేసి బాగా వేఇంచి,తీయాలి.
- తరువాత బాణలిలో కొంచెం నూనె పోసి,పెరుగు పోయాలి. దీనిలో ఆరెంజ్ కలర్ కూడా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని సగం అయ్యే వరకు గరిటెతో కలపాలి.
- దీనిలో ఫ్రై చేసిపెట్టుకున్న ఉండల్ని వేసి బాగా ఫ్రై చేయాలి.
No comments:
Post a Comment