| |

Thursday, February 5, 2009

Soya Cutlet


కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా,పోషక విలువలు ఎక్కువగా ఉండే రుచికరమైన

సోయా కట్లెట్ తయారి ఈ రోజుచూద్దాం..

కావలసినవి:
  • సోయా గుళికలు-50 గ్రాములు
  • బీన్స్-100 గ్రా.
  • ఉడికించిన బంగాళా దుంపలు-50 గ్రా.
  • తురిమిన క్యారెట్-50 గ్రా.
  • తరిగిన క్యాబేజీ-50 గ్రా.
  • ఉల్లిపాయలు-50 గ్రా.
  • పసుపు-పావ్ స్పూన్
  • ఎండుమిర్చి కారం-అర స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-అర స్పూన్
  • ఉప్పు-తగినంత
  • నూనె-2 స్పూన్లు
  • కొత్తిమీర -తగినంత
  • గుడ్డు-ఒకటి
  • గోధుమ పిండి-చల్లడానికి సరిపడా
తయారుచేయు విధానం:
  • అరకప్పు నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి.
  • అందులో సోయా గుళికలు వేసి పది నిమిషాలు ఉడికించి దించాలి.
  • నాన్ స్టిక్ పాన్లో ఒక స్పూన్ నూనె వేసి,ఉల్లిపాయ ముక్కలు వేఇంచాలి.
  • ఇవి గోధుమ రంగులోకి వచ్చాక పసుపు,అల్లం వెల్లుల్లి ముద్దా,కారం,ఉప్పు వేసి వేఇంచాలి.
  • తరువాత సన్నగా తరిగిన బీన్స్,క్యారెట్,క్యాబేజీ,కొత్తిమీర వేసి నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి.
  • అందులో సోయా గుళికలు,మెత్తగా చేసిన బంగాళా దుంపలు వేసి గట్టిపడే వరకు ఉడికించాలి.
  • ఇది చల్లారిన తరువాత చిన్న ఉండలుగా చేయాలి.
  • వీటిని గిలకొట్టిన గుడ్డులో ముంచి గోధుమ పిండిలో అద్ది తరువాత చేతితి వొత్తాలి.
  • తరువాత పెనం వేడి చేసి నూనె పోసి,కట్లెట్ రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.
దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు,పీచు పదార్ధాలు,విటమిన్లు పుష్కలంగా ఉంటాయ్..

No comments: