పండుగ సమయం దగ్గర పడుతుంది. ఎప్పటిలా కాకుండా ఈ సంక్రాంతిని కొంచెం సరికొత్త రుచులతోఆస్వాదిద్దాం.. దానిలో భాగంగా బీట్రూట్ బూరెలు ఎలా తాయారు చేయాలో చూద్దాం...
కావలసినవి:- పచ్చి బియ్యం పిండి- 1 కేజీ
- నీళ్లు-తగినన్ని

- రిఫైండ్ ఆయిల్- తగినంత
- బెల్లం తురుము- ముప్పావు కేజీ
- బీట్రూట్ తురుము- 300 గ్రాములు
- నెయ్యి- 150 గ్రా.
- ఎండు కొబ్బరి తురుము- 200 గ్రా.
- యాలకుల పొడి- ఒకటిన్నర స్పూన్
తయారుచేయు విధానం: - ముందుగ బీట్రూట్ తురుములో కొద్దిగా నెయ్యి వేసి నీళ్లు ఇంకే వరకు వేఇంచి ఉంచాలి.
- మందపాటి గిన్నెలో బెల్లం తురుము,తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం పట్టాలి.
- పాకంలో యాలకుల పొడి వేసి గిన్నె దించాలి.
- తరువాత బూరెలు,అరిసెల తయారి మాదిరిగానే పాకంలో ఓ చేత్తో పిండి పోస్తూ, మరో చేత్తో గరిటెతో పిండి ఉండలు కట్టకుండా బాగా తిప్పాలి.
- ఇలా మొత్తం పిండి వేసిన తరువాత నెయ్యి, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే పిండి చక్కగా మగ్గుతుంది.
- కళాయిలో నూనె పోసి కాగనివ్వాలి. ఉడికించిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా ప్లాస్టిక్ పేపర్ మిద బూరెలు లేదా బిల్లల మాదిరిగా వత్తి నూనెలో వేఇంచి తీయాలి..
దీనితో బీట్రూట్ బూరెలు రెడీ.. ఈ బీట్రూట్ బూరెల్లో పోషకవిలువలు కూడా ఉన్నాయ్.. కాబట్టి పిల్లలకి ఈ బూరెలు తినిపిస్తే tasty foodతో పాటు healthy food ని కూడా అందించిన వారౌతారు.. ఇవి 15 రోజుల వరకు నల్వ ఉంటాయ్..
...read more ⇒